గతవారం ఇజ్రాయెల్- అమెరికా సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఇరాన్‌పై జరిపిన దాడిలో ఆ దేశ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్.. ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ దాడులకు రష్యా సాయం చేస్తోందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. రష్యా ఇచ్చిన సమాచారంతో మా యుద్ద నౌకలు, విమానాలపై ఇరాన్ దాడి చేస్తోందిన ఆరోపించింది. పశ్చిమాసియాలో మా స్థావరాల గురించి టెహ్రాన్‌కు మాస్కో ద్వారానే సమాచారం అందుతుందని, పరోక్షంగా రష్యా యుద్ధంలోకి వచ్చిందని అమెరికా చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. బహ్రెయిన్ జుఫైర్‌లో ఉన్న అమెరికా నేవీ ఫిఫ్త్ ఫ్లీట్‌పై ఇరాన్ డ్రోన్ దాడుల్లో ఓ భవనం ధ్వంసమైంది.
ఇదిలా ఉండగా, తమ MQ-9 రేపర్ డ్రోన్లు కూలిపోయినట్టు అమెరికా ప్రకటించింది. అయితే, ఇవి ఎక్కడ కూలిపోయాయి, ఎవరు కూల్చేశారనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ, ఇరాన్ తీరంలో వీటి కూల్చే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల ఖతార్ దళాలు ఫ్రెండ్లీ ఫైట్‌లో భాగంగా ఎంక్యూ-9ను కూల్చివేసినట్టు సీబీఎస్ న్యూస్ నివేదించింది.
మరోవైపు, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణుల వర్షం కురుస్తోంది. దీంతో టెల్ అవీవ్‌లో వరుస పేలుళ్ల చోటుచేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు నివేదించాయి. ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోడానికి గగనతల రక్షణ వ్యవస్థ ఐరెన్ డోమ్‌ను యాక్టివేట్ చేసింది.
గల్ఫ్ దేశాలు ముఖ్యంగా అమెరికా మిత్రులనే ఇరాన్ టార్గెట్ చేసింది. అక్కడ అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని రాస్ తనూరాలో ఆరాంకో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడులతో అక్కడ చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. దుబాయ్‌లో కూడా స్థానిక పౌరులను ఎప్పటికప్పుడు అప్రమత్తంచేస్తున్నారు. కాగా, యుద్ధం రోజు రోజుకు తీవ్రతరం కావడంతో ఇరాన్ నుంచి జనం తరలిపోతున్నారు. ఇప్పటి వరకూ 2 లక్షల మంది దేశం వీడి వెళ్లినట్టు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. దాడుల్లో దాదాపు 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 180 మంది చిన్నారులే ఉన్నారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన మొదటి రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ పాఠశాలపై ఇజ్రాయెల్- అమెరికాలు జరిపిన దాడుల్లో 160 మంది విద్యార్ధినులు చనిపోవడం యావత్తు ప్రపంచాన్ని కలచివేసింది. బాలికల స్కూల్‌పై బాంబులు కురిపించడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa