ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజీనాల రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదల ఏకైక అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని అన్నారు. భీమడోలులో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో కలిసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో వైఎస్ షర్మిల ముందుకు రావడంతో ప్రజల్లో భరోసా పెరిగిందని, ప్రభుత్వంలో ఆందోళన మొదలైందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa