ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో ఎన్నో సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల కోసం వంద రోజుల ప్రణాళిక, సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులు ఇబ్బందిపడకుండా పరీక్షల మధ్య విరామం కూడా ప్రకటించింది ఈ విధానాన్ని గతేడాది నుంచి అమలు చేస్తున్నారు.టెన్త్ క్లాస్‌లో 100శాతం ఉత్తీర్ణత కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తాజాగా పదో తరగతి విద్యార్థులకు జారీ చేసిన హాల్‌టికెట్ల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.. కొన్ని మార్పులు చేశారు. పరీక్షా కేంద్రం విషయంలో విద్యార్థులు ఇబ్బందిపడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం పదో తరగతి విద్యార్థుల హాల్‌టికెట్‌లపై సరికొత్తగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించిన సంగతి తెలిసిందే. ఆ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేస్తే చాలు ఎగ్జామ్ సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో పదో తరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని గుర్తించేందుకు ఇబ్బందిపడేవారు. అందుకే ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లను ప్రత్యేకంగా రూపొందించారు. హాల్‌టికెట్లపై పూర్తి సమాచారం ఉండేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే హాల్‌టికెట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్కూల్ టీచర్లు విద్యార్థులకు వీటిని డౌన్‌లోడ్ చేసి అందజేయనున్నారు.
ఈసారి హాల్ టికెట్‌పై విద్యార్థి ఫొటో, కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది. హాల్‌టికెట్ పైభాగంలో రోల్ నంబరుతో పాటుగా లీప్ యాప్, ఏపీ ప్రభుత్వ రాజముద్ర కూడా ఉంటుంది. అలాగే పరీక్ష కేంద్రం వివరాలు కూడా ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్ క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించగా.. దానిని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. నగరాలు, పట్టణాలలో ఎగ్జామ్ సెంటర్ల విషయంలో ఇబ్బందులు ఉంటాయి.. అలాంటివారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కా్న్ పరీక్షా కేంద్రాలకు ఈజీగా తెలుసుకుని త్వరగా చేరుకోవచ్చు. అంతేకాదు హాల్‌టికెట్‌పై పరీక్షలకు సంబంధించిన టైమింగ్స్ కూడా ఇచ్చారు. అంతేకాదు పదో తరగతి విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.. హాల్‌టికెట్ చూపిస్తే సరిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa