ఐపీఎల్ 2026లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి ఎదురైంది. గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. ఈ ఓటమితో ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ముంబై ఇండియన్స్‌కు ఇదే అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఇంతకుముందు 2013లో రాజస్థాన్ రాయల్స్‌పై 87 పరుగుల తేడాతో ఓడిపోవడం ముంబైకి అతిపెద్ద ఓటమి. చెన్నైపై ముంబై చేసిన అత్యల్ప స్కోర్ (104) కూడా ఇదే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa