రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణాలపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. గుంతకల్లు డివిజన్లో ప్రతిపాదించిన ఆరు రైల్వే లైన్లకు సంబంధించిన సర్వేలు పూర్తయ్యాయి. ఈ సర్వే వివరాలను, సమాచారాన్ని పరిశీలించి త్వరలోనే రైల్వేబోర్డుకు నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వేబోర్డు నుంచి ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. గతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa