ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్ రేస్ (IPL 2026 Playoffs Race) ఇప్పటికే వేడెక్కింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు, జట్లు సాధించిన పాయింట్ల ఆధారంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే జట్లపై స్పష్టత క్రమంగా పెరుగుతోంది.అలాగే టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లపై కూడా అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ అంచనాలు, నిపుణుల విశ్లేషణల ప్రకారం ఏ జట్లకు ప్లేఆఫ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయో, మిగతా జట్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.ఏప్రిల్ చివరి నాటికి ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పోటీ మరింత ఉత్కంఠగా మారింది. అందుబాటులో ఉన్న డేటా, విశ్లేషణల ప్రకారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాల్లో ముందంజలో ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు కొనసాగుతున్నాయి.ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్రారంభంలో వెనుకబడ్డప్పటికీ, ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ముంబైకి ఇంకా ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.ఐపీఎల్ 2026లో మొత్తం 10 జట్లు 74 మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ప్రతి జట్టు 14 లీగ్ మ్యాచ్‌లలో పోటీపడగా, మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, ఫైనల్ వంటి నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌ల ద్వారా ఛాంపియన్‌ను నిర్ణయిస్తారు. మే 31న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్ 4లో నిలిచిన జట్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.ప్రస్తుతం ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో జట్లు ఎనిమిది మ్యాచ్‌లు చొప్పున ఆడగా, మిగిలిన జట్లు ఏడు మ్యాచ్‌లు పూర్తి చేశాయి.పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న జట్లలో పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్‌లతోనే 13 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ కూడా 5 విజయాలు సాధించినప్పటికీ, రన్‌రేట్ కారణంగా నాలుగో స్థానంలో ఉంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాల్లో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa