మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసర్‌ను క్రికెట్ బ్యాట్‌తో చితకబాదాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌లో ఆక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసర్లు డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వార్గియా ఆయనతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆకాశ్.. ఆ అధికారిని బ్యాట్‌తో కొట్టారు. అక్కడున్న వారు అడ్డుకున్నా ఆయన మాత్రం వదలకుండా చితకబాదారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa