ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వలన అనేక కుటుంబాలు చిన్నా భిన్నమయ్యాయన్నారు. ప్రస్తుతం 450 మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. వచ్చేనెల 1 నుంచి 3500 షాపులను నిర్వహిస్తామన్నారు. షాపుల నిర్వహణకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియామకాలు చేసినట్లు చెప్పారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa