ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్తార్‌పూర్‌ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్ల‌బోన‌న్న మ‌న్మోహ‌న్‌

national |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 02:03 AM

కర్తార్‌పూర్‌ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలంటూ  కోసం పాకిస్తాన్ పంపే ఆహ్వానాన్ని తిర‌స్కరించాల‌ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  నిర్ణ‌యించుకున్నారు. . నవంబర్ 9న ప్రారంభోత్సవానికి రావాలంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ . భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని తాము నిర్ణయించామని, పాకిస్తాన్ ప్రభుత్వం తరపున ఆయనకు రాతపూర్వకంగా కూడా ఆహ్వానం పంపిస్తామని ఖురేషీ వీడియో సందేశంలో పేర్కొన్నారు.  . గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా భారత సిక్కు యాత్రికుల కోసం కర్తార్పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. అక్కడి దర్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా డేరా బాబా నానక్ ఆశ్రమం వరకు నిర్మిస్తున్న ఈ కారిడార్ ద్వారా భారత సిక్కు యాత్రికులు వీసా లేకుండా దర్శనానికి వెళ్లే అవకాశం లభించనుంది. 


అయితే గ‌త కొంత కాలంగా భార‌త్‌-పాక్‌ల న‌డుమ ప‌రిస్థితులు కార‌ణంగానే పాక్‌ ఆహ్వానించిన వార్త‌లొచ్చిన కొద్ది సేపటికే   స్పందించిన మాజీ ప్ర‌ధాని వాటినితను తిర‌స్క‌రిస్తాన‌ని, స్వ‌త‌హాగా సిక్కునైన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెప్పాయి. 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa