రైతు భరోసా పథకం వర్తించాలంటే ప్రజాసాధికార సర్వేలో వివరాల నమోదుతో పాటు ఆధార్ అనుసంధానం చేసుకొని ఉండాలని.. ప్రత్తిపాడు మండల వ్యవసాయాధికారులు విజయబాబు సూచించారు. ఆయన గురువారం మండలంలోని కోయవారిపాలెంలో రైతు భరోసా పథకానికి అమరులైన అన్నదాతల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 946 బాతాల ప్రజాసాధికార సర్వే కింద నమోదు కావాల్సి ఉందన్నారు. ఆధార్ తప్పుగా నమోదైన ఖాతాల సంఖ్య 546, అనుసంధానం లేనివి 48 ఉన్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa