ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ ఇవాళ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు మెడ, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. రావత్ ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు రైలు మార్గంలో చేరుకున్నారు. అక్కడి నుంచి పౌరీ గఢ్‌వాల్ పట్టణానికి భద్రతా సిబ్బందితో కలసి తన కారులో బయల్దేరారు. ఈ క్రమంలో భీంగోడ, పంత్‌దీప్ ప్రాంతంలోకి రాగానే ఎంపీ కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎంపీకి మెడ, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. ఆయనను హరిద్వార్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లమని వైద్యులు సూచించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa