ఏపీ ప్రభుత్వంపై రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు. ఇక్కడి రైతుల రెండో రోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో ఓరైతు మాట్లాడారు. గత ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న పొలాలను తిరిగి వెనక్కిచ్చేస్తామని ఓ మంత్రి చెబుతుండటంపై ఆ రైతు స్పందిస్తూ, ఆ భూములను పనికిరాకుండా చేసి ఇప్పుడు తమకు ఇస్తామంటే ఏం చేసుకుంటాం? అని ప్రశ్నించారు. నాడు ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చి తమ పొలాలు తీసుకుందో ఆరోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, ముప్పై వేల ఎకరాలు కావాలన్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa