తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలం సెలగనూరు శివారు అటవీ ప్రాంతంలో పోలీస్ పార్టీ కూంబింగ్ చేస్తుండగా కొండపై గుహలో సీపీఐ ( ఎంఎల్ ) మావోయిస్టులు మందుపాతరలకు సంబంధించిన జెలిటిన్ స్టిక్స్ డంపను కనుగొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆద్నాన్ నయిం ఆస్ని వెల్లడించారు . శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు . అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో నిషేధిత సీపీఐ మావోయిస్టులు మందుపాతర్లు అమర్చి విధ్వంసం సృష్టించేందుకు వీలుగా 16 జెలిటిన్ టిక్స్ , నాటు తుపాకులు తయారు చేయడానికి ఉపయోగించే యంత్రాలు , పరికరాలు , 12 బో తుపాకీలు . 93 తుపాకీల్లో ఉపయోగించే కాట్రిడ్జ్ ఖాళీ బాక్సులు . వెల్డింగ్ చేసేందుకు ఉపయోగించే సామాగ్రి ఉన్నాయన్నారు . నిషేధిత సీపీఐ మావోయిస్టులు విధ్వంసం సృష్టించే ఉద్దేశ్యంతో దాచి ఉంచినట్లు విచారణలో తెలిసిందన్నారు . ఈ పేలుడు పదార్థాలను పట్టుకున్న పోలీస్ పార్టీని జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం ఆస్కి , ఆడిషనల్ ఎస్పీ ఆపరేషన్ ఆరిఫ్ హఫీలు అభినందించారు . ఈ విషయమై గుర్రేడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ నయం ఆస్మి తెలిపారు . ఈ సమావేశంలో రంపచోడవరం ఎఎస్పీ వకుల్ జిందాల్ తదితదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa