ఈ నెల 30న పంచారామక్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వర ఆలయంలో శ్రీ పంచమి సరస్వతి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వయంభూగా ఉన్న సరస్వతి అమ్మవారికి ఘనంగా పంచామృత అభిషేకాలు హోమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇవో పులి నారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వర ఆలయంలో ఉన్న సరస్వతి అమ్మవారికి ఈ నెల 30న గురువారం ఉదయం 8:30 గంటల నుండి పంచామృత అభిషేకం పూజలు సరస్వతి హోమం మరియు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులచే సరస్వతీ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు సరస్వతి రూపును దేవస్థానం మరియు దాతల సహకారంతో అందిస్తున్నట్లు తెలిపారు ఇంకా భక్తులు ఎవరైనా సరే ఈ పూజల సందర్భంగా వంద రూపాయలు చెల్లిస్తే వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీతా విశ్వనాధ్ సామర్లకోట పి ఏ సి ఎస్ చైర్మన్ దవులూరి దొర బాబు అతిథులుగా పాల్గొంటారన్నారు. పూజల అనంతరం విద్యార్థులకు మధ్యాహ్నం అన్నదాన కమిటీ వారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.ఈ సమావేశంలో ఆలయ అర్చకులు సన్నిధి రాజు సుబ్బన్న సన్నిధిరాజు వెంకన్న తదితర అర్చకులు పాల్గోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa