విజయవాడలో రెండు గ్రూపుల విద్యార్థులు హల్‌చల్ చేశారు. పరస్పరం కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం కలకలం రేపింది. పటమటలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో వారంతా ఒక్క చోట చేరి కొట్టుకున్నారు. అయితే, ఇందులో మాజీ రౌడీషీటర్ జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ దాడి ఘటనలో రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. పటమటలో వారంతా దాడులకు తెగబడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa