ఓ యువకుడిని స్థానికులు సజీవ దహనం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కలకలం రేపింది. భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్ అనే యువకుడు ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆ మహిళకు సంబంధించి ఓ వీడియో క్లిప్‌ను ఆ యువకుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు.
దాన్ని చూసిన ఆ మహిళ బంధువులు అతడిపై ఆగ్రహంతో ఉన్నారు. తమ వర్గానికి చెందిన మహిళతో అతడు సన్నిహితంగా ఉంటున్నాడని ఆ మహిళ బంధువులు ఈ రోజు ఉదయం ఆ యువకుడిని ఇంటి నుంచి బటయకు లాక్కొచ్చి, చెట్టుకు కట్టేసి చావబాదారు. ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి నిరసకు దిగి, పోలీసుల వాహనాలను దగ్ధం చేయడం అలజడి రేపింది. దీంతో పోలీసులు అదపను బలగాలను పిలిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa