ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లయిన మరుసటి రోజే ప్రియుడితో వధువు పరార్

national |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 11:03 AM

పెళ్లయిన మరుసటి రోజే వధువు ప్రియుడితో పారిపోయిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. సేలం జిల్లా చిన్నమసముద్రానికి చెందిన పూమారై కూతురు సత్య(20)కు సెంగవల్లి నడువలూరుకు చెందిన పెరియస్వామి కుమారుడు రవికుమార్‌(28)తో ఈ నెల నాలుగో తేదీన వివాహం జరిగింది. రవికుమార్ వరికోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదో తేదీన సాయంత్రం పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లిన సత్య తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో సత్య తల్లిదండ్రులు సెంగవల్లి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.అదే సమయంలో చిన్నసముద్రానికి చెందిన వల్లరసు(23) అనే యువకుడిని సత్య పెళ్లి చేసుకుని రక్షణ కల్పించాలంటూ ఆత్తూర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్‌, బంధువులు, సత్య తల్లిదండ్రులు వెంటనే ఆత్తూర్ పీఎస్‌కు చేరుకున్నారు. తాను, వల్లరసు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకుండా రవికుమార్‌తో బలవంతంగా పెళ్లి చేసినందునే ఇంటి నుంచి పారిపోయినట్లు సత్య పోలీసులకు చెప్పింది. వరుడు కుటుంబం తనకు పెట్టిన బంగారు ఆభరణాలను పోలీసుల సమక్షంలోనే తిరిగిచ్చేసింది. అయితే పెళ్లికి అయిన ఖర్చును తిరిగిచ్చేయాలని రవికుమార్‌ కోరడంతో సత్య, వల్లరసు అంగీకరించారు. దీనికి సంబంధించి పోలీస్‌స్టేషన్‌లోనే స్టాంప్ పేపర్లపై సంతకాలు చేసి వెళ్లిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa