తమిళనాడు రాష్ట్రంలో కరోనా కలకలం రేపుతోంది. ఈ మహమ్మారి కారణంగా..డిఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ (62) చనిపోయారు. కరోనా కారణంతో ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ వైరస్ బారిన పడిన ఎమ్మెల్యే చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కానీ పరిస్థితి విషమించి...2020, జూన్ 10వ తేదీ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. పుట్టిన రోజునే ఆయన చనిపోవడం అందర్నీ కలిచివేసింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
2020, జూన్ 02వ తేదీన కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరారని క్రోమ్ పేటలోని డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్ వైద్యులు వెల్లడించారు. మంగళవారం రాత్రి నుంచి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో బుధవారం తెల్లవారుజామున అన్బళగన్ తుదిశ్వాస విడిచారన్నారు. అయితే..ఈయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు సమాచారం. అన్బళగన్ విషయానికి వస్తే..డీఎంకే పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001, 2011, 2016లో ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. చెన్నై చేప్పాకం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa