విజయవాడలోని బందర్ రోడ్డు రిలయన్స్ ఫ్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అదుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. అతనిని ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపు చేయడానికి 9 అగ్నిమాపక వాహనానాలు వచ్చాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa