ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత క్రికెట్ జట్టు తొలి సారథి.. కఠారి కనకయ్య నాయుడు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 11, 2020, 01:17 PM

క్రికెట్ ప్రపంచంలో భారత్ తొలి అడుగులు వేసే సమయంలో, సారథిగా ముందుకు నడిపిన ఆటగాడు సి.కె. నాయుడు. భారతీయ టెస్టు క్రికెట్ జట్టుకు ఆయన మొదటి కెప్టెన్. టెస్టుల్లోనూ ధాటిగా పరుగులు చేసే బ్యాట్స్ మన్ గా, ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసే బౌలర్ గా, అరుదైన ఆల్ రౌండర్ గా తిరుగులేని ఖ్యాతిని పొందారు. 1895 అక్టోబరు 31న మహారాష్ట్రలోని నాగ్ పూక్ లో జన్మించిన కఠారి కనకయ్య నాయుడు కుటుంబీకుల స్వస్థలం మచిలీపట్నం.సి.కె. నాయుడు తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ 1916లో ఆడాడు. బాంబే ట్రయాంగులర్ టోర్నీలో హిందూ జట్టులో 9వ నంబర్ బ్యాట్స్ మన్ గా బ్యాటింగ్ చేశాడు. మొత్తం మీద 207 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 26 సెంచరీలు, 58 అర్థ సెంచరీలు సాధించాడు. ఒక డబుల్ సెంచరీ చేశాడు. 7 టెస్ట్ మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 411 వికెట్లు పడగొట్టాడు. నాయుడు ఆటతీరుకు ముగ్ధుడైన హోల్కర్ రాజు తన రాజధాని ఇండోర్ (ఇప్పటి మధ్యప్రదేశ్ లో భాగం) నగరానికి పిలిపించాడు. తన సైన్యానికి కెప్టెన్ గా సి.కె. నాయుడును ప్రకటించాడు. అలాగే కల్నల్ హోదాను ప్రదానం చేశాడు. అప్పటి నుంచి కల్నల్ నాయుడుగా ప్రాచుర్యం పొందాడు మన మేటి క్రికెటర్. సి.కె. నాయుడు గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరో విషయం తెలుసుకోవాలి.భారతదేశపు అత్యంత నమ్మకమైన ఆన్‌లైన్ రమ్మీ ఫ్లాట్‌ఫారం, రమ్మీకల్చర్‌పై అత్యంత ఆకర్షణీయమైన రివార్డులు ఎంజాయ్ చేయండి. ఈ గేమ్ ఇన్ స్టాల్ చేసుకొని లాక్ డౌన్ ను ఎంజాయ్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించుకోండి.తొలి తరం భారతీయ క్రికెటర్లలో యువతపై ఎక్కువ ప్రభావం చూపిన ఆల్ రౌండర్ ఈయనే. సి.కె. నాయుడు స్ఫూర్తితోనే అప్పట్లో యువతరానికి క్రికెట్ పై మక్కువ పెరిగింది. క్రికెట్ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1956లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. సి.కె. నాయుడు ట్రోఫీ పేరుతో ఒక టోర్నీని కూడా భారత క్రికెట్ బోర్డు ఇప్పటికీ నిర్వహిస్తోంది. క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న భారతీయ క్రీడాకారులకు సి.కె. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు పేరుతో బిసిసిఐ అవార్డును ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. కపిల్ దేవ్ తో సహా చాలా మంది దిగ్గజ క్రికెటర్లు ఈ అవార్డును అందుకున్నారు. ఆడింది కొన్ని టెస్ట్ మ్యాచ్ లే అయినా ఆయన స్ఫూర్తి మాత్రం అపారం అని ఖ్యాతి పొందారు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఆల్ రౌండర్ ఎవరంటే మొదట గుర్తుకు వచ్చే పేరు సి.కె. నాయుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa