ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 12:55 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది. జూలై 11 నుంచి 18 వరకు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను రిలీజ్ చేశారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో కూడా ఇలా ఇంటర్ పరీక్షలను రిలీజ్ చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని మంత్రి సురేష్ అన్నారు. ఏపీలో మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించగా, చివరి పరీక్షకు ముందు దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ విధించారు. దీంతో మిగిలి పోయిన ఒక్క పరీక్షను జూన్ 3న నిర్వహించారు. అంతకు ముందే మార్చి 19 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించారు. మధ్యలో లాక్ డౌన్ కారణంగా కొంత ఆలస్యం అయింది. రెండు నెలలు ఆలస్యంగా పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 5,07,230 మంది పరీక్షలు హాజరయ్యారు. అందులో 300,560 మంది పాస్ అయ్యారు. దీంతో 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,35,653 మంది హాజరయ్యారు. అందులో 2,76,389 మంది పాస్ అయ్యారు. 63 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఈ రోజు విడుదలైన ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో రక్షణ చర్యలు తీసుకోవడం తప్పనిసరి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు వాడాలని ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa