ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచ్చం ‘అతడు’ సినిమా లాగే స్కెచ్..

national |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 03:02 PM

ఢిల్లీ శివారులో రన్ హౌలా ప్రాంతంలో ఓ మర్డర్ జరిగింది. కేసు విచారణ చేసిన పోలీసులు వాస్తవాలను గుర్తించి షాక్ కు గరయ్యారు. ఓ వ్యక్తి తన హత్యకు తానే సుఫారి ఇచ్చిన హత్య చేయించుకున్నాడని తెలియడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అచ్చం అతడు సినిమాలో మాదిరిగా జరిగిన ఈ క్రైమ్ సీన్ కలకలం సృష్టించింది. కేసు విచారణలో మృతుడు వినియోగించిన ఫోన్ ను పరిశీలించిన పోలీసులకు ఈ విషయాలు తెలిశాయి. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన హత్యను తానే చేయించుకున్నాడని పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఓ నిత్యావసరాల వ్యాపారి గౌరవ్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనను తాను హత్య చేయించేందుకు ఓ మైనర్ బాలుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 9న తన ఇంటి నుంచి గౌరవ్ ముందు వేసుకన్న ప్రణాళిక ప్రకారం ప్రజారవాణ సదుపాయాల్లోనే రన్‌హౌలా ప్రాంతానికి చేరుకున్నాడు. గౌరవ్ అంతకుముందే తన హత్య కోసం డబ్బులు ఇచ్చిన వ్యక్తులకు ఫోన్ ద్వారా ఫోటోను పంపించాడు. ఈ క్రమంలో గౌరవ్ రన్‌హౌలా ప్రాంతానికి చేరుకోగానే నిందితులు అతడి చేతులను వెనక్కి విరిచి కట్టేశారు. అనంతరం ఓ చెట్టుకు ఉరి వేసి దారునంగా హత్య చేశారు. ఈ కేసులో హత్య చేసిన నిందితులతో పాటు మరో మైనర్‌ను పోలీసులు అరెస్టు చేసి లోతుగా విచారణ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa