ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు శాసనమండలిలో వీగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టి 90 రోజులు పూర్తయ్యింది. దీంతో మరోసారి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు సర్కార్ యత్నిస్తునట్టు సమాచారం. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి మళ్లీ మండలిలో ప్రవేశ పెట్టేలా సర్కార్ ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa