లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతపై చైనా స్పందించింది. మా భూభాగంలోకి భారత సైనికులు చొచ్చుకు వచ్చారని చైనా తెలిపింది. ఈ ఘర్షణలో ఐదుగురు సైనికులు చనిపోయారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. 11 మందికి తీవ్రగాయాలైయ్యాయని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.
ఈ నెల 23న భారత్, చైనా, రష్యా, విదేశాంగ మంత్రుల సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో భారత్- చైనా సరిహద్దు సమస్యను భారత విదేశాంగశాఖ ప్రస్తావించనున్నది. చైనా-భారత్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. గాల్వాన్ వ్యాలీలో భారత్ జవాన్లపై చైనా కాల్పులు జరిపింది. చైనా కాల్పుల్లో ముగ్గురు భారత్ జవాన్లు మృతి చెందారు. ఆర్మీ ఆఫీసర్ తో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa