తమిళనాడులో ఓ చెట్టును కట్ చేస్తుంటే నీళ్లు వస్తున్నాయి. ఐఎఫ్ఎస్ అధికారి దిగ్విజయ్ సింగ్ ఖాటీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చెట్టును గొడ్డలితో నరకగానే నీళ్లు బయటకు వస్తున్నాయి. ఈ చెట్లను టెర్మినాలియా టోమెంటోసా అంటారని, ఇవి కాండాల్లో నీటిని నిల్వ ఉంచుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ చెట్లను అశాన్, అశ్నా, సజ్ అని కూడా పిలుస్తారు. చెట్టు నుంచి నీళ్లు దారాళంగా వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చక్కర్లు కొడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa