విశాఖ గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలి సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. కుమారి కళ్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తం గా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. అయితే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. సంఘటన జరిగిన సమయంలో కారులో డ్రైవర్ తో పాటు నలుగురు ఉన్నారు. వీరందరూ సురక్షితంగా బయటపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa