ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖాన్ అబాద్ జిల్లాలో తాలిబన్లు రక్తపుటేరులు పారించారు. తపాయి అక్తర్ ఏరియాలో భద్రతా బలగాలను లక్ష్యం చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. తాలిబన్ల దాడుల్లో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. తాలిబన్ల ఆచూకీ కోసం బలగాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa