దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే పురాతన,చారిత్రక కట్టడాలు,మ్యూజియాలు, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండే అన్ని కట్టడాలను మే 15 వరకు మూసేస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పర్యాటక రంగం పై ప్రభావం పడే అవకాశం ఉంది. మరో వైపు తెలంగాణ వైద్య శాఖ కూడా పలు ప్రతిపాదనలు సిద్దం చేసింది. బార్ల మూసివేత,థియేటర్లలో సగం మందికే అనుమతి వంటి ఆంక్షలను సిద్దం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa