ఓ 26 ఏళ్ల కుర్రాడు తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి కంగారుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముంది? ఏంటా స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగి మండలం నడిపల్లికి చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు గుంటూరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నాడు. ఇంటికి దూరంగా ఉంటూ పని చేసుకుంటున్న ఆ కుర్రాడు గురువారం రాత్రి స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం అతడి ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ సందేశాన్ని చూసిన వెంటనే ఆందోళన చెంది ఇంటి నుండి బయటకు వెళ్లాడు. దీంతో కంగారుపడ్డ ఇంటి వారు ఫోన్ చేసినా తీయలేదు. చాలా సేపు ప్రయత్నించగా చివరకు ఫోన్ తీసిన ఆ కుర్రాడు తాను విజయరాయిలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్నానని అమ్మా .. నాన్నా నన్ను క్షమించండి నాకు కరోనా పాజిటివ్ వచ్చింది నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అతడిని వెతుక్కుంటూ వెళ్లగా అపస్మారక స్థితిలో గుర్తించారు. అంబులెన్స్ వచ్చే సరికి ఆ కుర్రాడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చినా తగు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ ను జయించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఎవరూ ఇలా అధైర్య పడద్దని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa