ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. 2026 మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అదేవిధంగా, ఓఎస్ఎస్సి, ఒకేషనల్ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా ఈ టైమ్ టేబుల్‌ను ముందుగానే విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు 2026 మార్చి 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయి. అన్ని ప్రధాన పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తాయి.ప్రధాన పరీక్షల అనంతరం మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2తో పాటు ఎస్ఎస్సి, ఒకేషనల్ కోర్సుల థియరీ పరీక్షలు జరుగుతాయి.అయితే, సైన్స్ పరీక్షలు మరియు కొన్ని ఒకేషనల్ కోర్సుల పేపర్లకు మాత్రమే పరీక్ష ముగింపు సమయం ఉదయం 11:30 గంటల వరకు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa