ఏపీలో విద్యుత్ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలుష్య నియంత్రణ దిశగా ఏపీఎస్ఆర్టీసీ వేస్తున్న ముందడుగులో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. తొలి దశలో రాష్ట్రంలో 350 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాబోతున్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల విధానంలో వీటిని ప్రవేశపెడతారు. వీటిని నాలుగు మార్గాల్లో నడపనున్నారు. తిరుమల-తిరుపతి మధ్య 100 బస్సులు, విజయవాడ- గుంటూరు మధ్య 100, విశాఖపట్నంలో 100, కాకినాడలో 50 బస్సులు నడుపుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa