వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నిత్యానంద మరోసారి సంచలన ప్రకటన చేశారు. కరోనా సెకండ్, థర్డ్ వేవ్ లు విజృంభిస్తుండటంతో కైలాస ద్వీపానికి భారతీయుల రాకపై నిషేదం విధించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో రాజపత్రాన్ని సైతం విడుదల చేశారు. భారతీయులతో పాటు బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మలేసియా దేశాల నుంచి రాకపోకలు నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa