దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 అర్థరాత్రి వరకు పొడిగించింది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం తెలిపింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది. అలాగే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని మార్గాల్లో అంతర్జాతీయ ప్రయాణ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa