ప్రగతి భారత్ ఫౌండేషన్‌కు జీవీఎంసీ 69వ వార్డు కార్పొరేటర్, రాష్ట్ర తెదేపా అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం ట్రస్టు ఛైర్మన్, ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ షీలానగర్‌లో 300 ఆక్సిజన్ పడకల కొవిడ్ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పార్టీలకు అతీతంగా ట్రస్టులు, రాజకీయ నాయకులు, దాతలు ఇలాంటి విపత్కర సమయంలో సేవలు అందించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa