ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ ఆర్మీలో 189 పోస్టులు

national |  Suryaa Desk  | Published : Thu, May 27, 2021, 01:39 PM

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ " ఎస్ఎస్‌సీ " టెక్ 57 మెన్‌, టెక్ 28 ఉమెన్ నియామకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైనవారికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ " ఓటీఏ " చెన్నైలో శిక్షణ ఇస్తారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జూన్ 23 వరకు అందుబాటులో ఉంటాయి.


మొత్తంఖాళీలు: 189


ఇందులో టెక్-57 మెన్ 175, టెక్‌-28 ఉమెన్ 14 ఉన్నాయి.


అర్హత: ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. ఫైనలియర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


వయస్సు: 20 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 23


వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa