అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసింది.దీంతో ఆదేశానికి భారతీయులు తరలివెళ్తున్నారు. నేటి నుంచి అమెరికా - భారత్ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు అగ్రరాజ్యం చెబుతోంది. కోవిడ్ కారణంగా గతేడాది మార్చి 23న అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూనే సాధారణ ప్రయాణాలను పునురుద్ధరించడం తమ లక్ష్యమని ఆదేశం పేర్కొంటోంది. భారత్ సహా చైనా , మెక్సికో, కెనడా, ఐరోపాకు చెందిన ప్రయాణికులపై కూడా యూఎస్ ఆంక్షలను తొలగించింది. నిబంధలను ఉల్లంఘించినవారిపై 35వేల డాలర్ల వరకూ జరిమానా విధించనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa