ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ లే అవుట్లలో 5 శాతం భూమిని నిరు పేదల గృహాల కోసం వైఎస్సార్, జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్ కు కేటాయించాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. లేఅవుట్ యజమానులు, డెవలపర్స్ 5 శాతం భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్ కు అప్పగించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి గెజిట్ విడుదల చేశారు. ఏర్పాటు చేసిన లే అవుట్ లో 5 శాతం స్థలం కేటాయించడానికి ఇష్టం లేకపోతే అదే లే అవుట్ కు 3 కి. మీ పరిధిలో మరో చోట ఆ మేరకు భూమిని లేదా ఆ మేరకు భూమి ధరను సంబధిత మున్సిపాలిటీకి/ పట్టణ అభివృద్ధి సంస్థకు చెల్లించవచ్చని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa