ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదం లో బిపిన్‌ రావత్‌ భార్య మధులిక దుర్మరణం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 05:19 PM

ఆర్మీ హెలికాఫ్ట‌ర్ ప్రమాద ఘటనలో  బిపిన్‌ రావత్‌ భార్య మధులిక దుర్మరణం చెందారు. ఈ హెలికాఫ్ట‌ర్ లో మొత్తం 14 మంది ప్రయాణించారు అందులో  మృతిచెందిన వారి సంఖ్య 13కు చేరింది. మృత దేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారం గురిటిస్తున్నారు. ఈ ప్రమాదం లో బిపిన్‌ రావత్‌ శరీరం 80 శాతం కాలిపోయింది సమాచారం. ప్రస్తుతం బిపిన్ రావత్ ను ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోను ఆర్మీ అధికారులు విడుదల చేసారు. ఈ ప్రమాదం అనంతరం బిపిన్ రావత్ ప్రాణాలతోనే ఉన్నారు ఆయనను అత్యవసర చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు, ప్రస్తుతం వైద్యులు బిపిన్ రావత్ కు అత్యవసర చికిత్సా అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఘటన స్థలాన్ని ఆర్మీ అధికారులు పరీక్షిస్తున్నారు. బ్లాక్ బాక్స్ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ ప్రమాద ఘటన పై వాయుసేన విచారణకు ఆదేశించింది. రేపు పార్లమెంట్ లో ఈ ప్రమాదం పై కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa