బెంగళూరు: ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. గగనతల ప్రయోగాలలో ఇప్పటికే అగ్రదేశాల సరసన చేరిన భారత్ గురువారం సాయంత్రం పీఎస్‌ఎల్‌వీ-సీ39 అంతరిక్ష వాహకనౌకను ప్రయోగించనుంది. సరిగ్గా సాయంత్రం ఏడుగంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి 29 గంటల కౌంట్‌డౌన్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైంది.వాతావరణ అననుకూలత కారణంగా ఇబ్బందులు తలెత్తవచ్చని మొదట భావించినప్పటికీ అనుకున్న సమయానికే రాకెట్‌ను ప్రయోగించేందుకు మిషన్ రెడీనెస్ రివ్యూకమిటీ, లాంచ్ ఆధరైజేషన్ బోర్డ్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. శ్రీహరికోట లోని సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించనున్న ఈ పీఎస్‌ఎల్‌వీ సీ-39 అంతరిక్ష వాహకనౌక ద్వారా.. 1425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
పీఎస్‌ఎల్‌వీ-సీ39 ఉపగ్రహ ప్రయోగానికి ఎక్స్‌ఎల్ తరహా ఇంజన్లను వినియోగిస్తున్నారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహ శ్రేణిలో ఇది ఎనిమిదవది. ఇప్పటికే ఏడు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. 2013 జూలై 1న పీఎస్‌ఎల్‌వీ ద్వారా నావినేషన్ వ్యవస్థ కోసం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. అందులో ఉన్న మూడు అణుగడియారాల్లో సాంకేతిక లోపం తలెత్తి అవి పనిచేయడం మానేయడంతో సేవలకు ఆటంకం ఏర్పడింది. దీనిస్థానంలో ప్రస్తుతం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహాన్ని పంపుతున్నారు. జీపీఎస్ తరహాలో ఇస్రో ఈ ప్రాంతీయ నావినేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. సముద్ర నావలకు, ప్రకృతి విపత్తులకు, పర్వతారోహకులకు, రైల్వే, ఎయిర్‌ఫోర్స్‌కు, వాహనాల ట్రాకింగ్‌కు నావిగేషన్ సేవలను ఈ శాటిలైట్లు అందించనున్నాయి. తదుపరి నావిగేషన్ శాటిలైట్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐని 2018 ఏప్రిల్‌లో ప్రయోగిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa