హిందూస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైజెస్ హరియాణాలోని ఫరీదాబాద్ ప్లాంట్ ను మూసివేసింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఎండీ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కనీసం రోజుకి 1.2 కోట్ల సిరంజీల కొరత ఏర్పడే అవకాశం ఉందన్ని, ఫలితంగా కొవిడ్ వ్యాక్సినేషన్‌తో పాటు ఇతర చికిత్సా కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ రాజీవ్‌నాథ్ తెలిపారు. హెచ్‌ఎండీలో రోజూ 1.5 కోట్ల సూదులు, 80 లక్షల సిరంజీలు ఉత్పత్తి చేస్తున్నట్లు రాజీవ్‌నాథ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa