పశ్చిమ్ బంగలో వర్షాలకు ఓ బస్సు నీట మునిగింది. పటిపుకూర్ రైల్వే వంతెన వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో ఆ దిశగా వెళ్తొన్న బస్సు వరద నీటిలో చిక్కుకుపోయిన ఘటనకు సంబంధించిన వీడియో బయటకువచ్చింది. నీటి మట్టం పెరుగుతుండటంతో బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో వారు ఆ బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు స్థానికుల సాయంతో కొందరు సురక్షితంగా బయట పడగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ బస్సులోకి వరదనీరు చేరడంతో ప్రయాణికుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు దెబ్బతిన్నాయి. స్థానికులు లేక్‌టౌన్, ఆల్టోడంగ పోలీసులను అప్రమత్తం చేయడంతో జెస్సోర్ రోడ్డును మూసివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa