బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి కరోనా సోకింది.కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన సోమవారం RTPCR పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గతంలో గంగూలీ కుటుంబసభ్యులు సైతం ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa