చీఫ్ లిక్కర్ రూ.75కే రూ.50 ఇస్తాం అన్న వ్యాఖ్యలతో సోము వీర్రాజు రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ట్రెండింగ్‌లో సోము పేరు నిలిచింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సోము వీర్రాజు పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #SomuVeerraju అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను కవర్ చేయని జాతీయ మీడియా దాదాపుగా లేదు. అన్ని మీడియా సంస్థలు ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇచ్చాయి. మొత్తంగా చూస్తే- ప్రజా ఆగ్రహ సభను చీప్ లిక్కర్ కామెంట్స్.. డామినేట్ చేశాయి. అసలు పాయింట్ గాలికి ఎగిరిపోయింది. ఈ కామెంట్స్‌కే ప్రాధాన్యత ఇచ్చాయి మీడియా సంస్థలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa