ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ వాహనదారులకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 08:54 AM

సాంకేతిక సమస్యతో గురువారం ఏపీ రవాణా శాఖ వెబ్ సైట్ మొరాయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. జనవరి 1 నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో అంతకు ముందే వాహనాలు కొనుగోలు చేయాలని ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య ఇబ్బందికి గురి చేసింది. ఈ వ్యవహారంపై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. రవాణాశాఖ వెబ్‌సైట్‌ సర్వర్లు పనిచేయకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని, సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వాహనదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఇప్పుడు కొనుగోలు చేసిన వాహనాలకు జనవరి 1 తర్వాత కూడా పాత ఛార్జీల ప్రకారమే రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఖచ్చితంగా జనవరి 1 ముందు కొనుగోలు చేసిన పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa