కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఇంతవరకు తెరపైకి పెద్దగా రాలేదు. అయితే తాజాగా లండన్ కింగ్స్ కాలేజీ, హెల్త్ సైన్స్ కంపెనీ జెడ్‌ఓఈ సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధన షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద వస్తే అది ఒమిక్రాన్ కావచ్చునని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిస్థితుల్లో చర్మంపై వచ్చే అసాధారణ మార్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa