పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా ఆంక్షలను కఠినతరం చేసింది. బెంగాల్‌లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్పాలు, సెలూన్‌లు, బ్యూటీ పార్లర్‌లు, జూలు మరియు అమ్యూజ్‌మెంట్ పార్కులు సోమవారం (జనవరి 3) నుండి మూసివేయబడతాయి. ప్రభుత్వం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవసరమైన సేవలను అనుమతించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణుకు పుట్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో 50శాతం సిబ్బందితోనే పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనవరి 5 నుంచి ఢిల్లీ, ముంబై నుండి కోల్ కతాకు వారానికి రెండుసార్లు (సోమవారం, శుక్రవారం) మాత్రమే విమానాలకు అనుమతి ఇచ్చింది. షాపింగ్స్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ లు, రెస్టారెంట్లు, బార్లపైనా ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. 50శాతం సామర్థ్యంతోనే నడిపించుకోవాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa