సెంచూరియన్ గెలుపుతో ఉత్సాహంతో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ కు సిద్దమైంది. నేడు ఆథిత్య జట్టు దక్షిణాఫ్రికాతో వాండరర్స్ వేదికగా తలపడనుంది. దక్షిణాఫ్రికాపై తొలిసారి సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటున్న టీమ్‌ఇండియా ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటేందుకు సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 1.30 నుండి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం కనిపించడం లేదు. మ్యాచ్ వేదిక వాండరర్స్ మైదానం టీమ్‌ఇండియాకు కలిసొచ్చిన వేదిక. ఇక్కడ ఇంతకుముందు ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో భారత్ రెండింటిలో గెలిచింది. మూడు డ్రాగా ముగిశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa