ప్రపంచంలోని ఆయా దేశాల్లో వింత చట్టాలు ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలోని సమోవా ద్వీపంలో ఉన్న ఓ వింత చట్టం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక్కడ భార్య పుట్టిన రోజు మర్చిపోతే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. భార్య ఫిర్యాదు చేయకుంటే ఏం పర్వాలేదు. కానీ ఒకవేళ పుట్టిన రోజు మర్చిపోయిన విషయం పోలీసులకు చెబితే గనుక ఆ భర్తకు జైలుకే. ఈ చట్ట ప్రకారం మొదటి సారి తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తారు. అదే రెండో సారి మర్చిపోతే ఇక నేరుగా జైలుకే పంపుతారు. భార్యల విషయంలో భర్తలు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండకూడదనే అక్కడి ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చింది.
మరి కొన్ని దేశాల్లో ఉన్న వింత చట్టాలు:
-ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్ ధరించి బయటకు వెళితే నేరం. జైలు శిక్ష విధిస్తారు.
- ఇటలీలోని మిలాన్ నగరంలో ఇతరులను చూసి ముఖం చిట్లించితే అంతే సంగతి.
-తూర్పు ఆఫ్రికాలో బయట జాగింగ్ చేయడం చట్టవ్యతిరేకం.
-అమెరికాలోని ఓక్లహమా రాష్ట్రంలో కుక్కలపై అరిస్తే, తిడితే జైలు శిక్ష విధిస్తారు.
-సింగపూర్‌లో చూయింగ్ గమ్ నమలడం నిశిద్దం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa