భారత టెస్టు జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' రేసులో నిలిచాడు. డిసెంబర్ నెల అవార్డు కోసం ఐసీసీ తాజాగా నామినేటెడ్ ఆటగాళ్ల లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో మయాంక్ తో పాటు న్యూజిలాండ్ క్రికెటర్ అజాజ్ పటేల్ తో పాటు ఆసీస్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఉన్నారు. మయాంక్ 2 మ్యాచుల్లో 69 యావరేజ్ తో 276 రన్స్ చేశాడు. ఇటీవల ముంబైలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో 150, 62 పరుగులతో రాణించాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో 60 పరుగులు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa