పిచ్చిపరాకష్టకు చేరితే నష్టమేనటా. ఈ రోజు ఎంతో మంది యువత పబ్జీ ఆటల్లో ముగిని ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ప్రమాదవశాత్తూ రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. అల్వార్ జిల్లా తెల్హా గ్రామానికి చెందిన లోకేశ్ మీనా(22), రాహుల్(19) అన్నదమ్ములు. ఈ ఇద్దరూ రూప్బాస్ పట్టణంలోని తమ అక్క ఇంటి దగ్గర ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు స్వగ్రామంలో ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న లోకేశ్, రాహుల్ ఖాళీ సమయంలో పబ్జీ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. పలువురు పబ్జీ మోజులో పడి టైమ్ వేస్ట్ చేసుకోవడమే కాదు, ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. పబ్జీకి బానిసగా మారి బంధాలను కూడా వదలించుకోవడానికి వెనుకాడటం లేదు. కొందరు మానసిక రోగులుగా మారి దీనిని నుంచి బయటపడటానికి ఆస్పత్రులకు పరుగులు తీసుకున్నారు. పబ్జీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పబ్జీ గేమ్‌కు ఇద్దరు అన్నదమ్ములు బలయిన ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో శనివారం సాయంత్రం సంభవించింది. ఈ క్రమంలో శనివారం రూప్బాస్ సమీపంలోని రైలు పట్టాలపై కూర్చుని ఫోన్లో పబ్జీ ఆడుకుంటూ ఆటలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో అటుగా రైలు వచ్చినా ఇద్దరూ గమనించలేదు. ఆటలో పూర్తిగా లీనమైన అన్నదమ్ములు మైమరిచిపోయారు. దీంతో రైలు వారిని ఢీకొట్టడంతో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం వాటిని కుటుంబసభ్యులకు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa